రక్త బంధం, రజనీ ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన జీవిత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రక్త బంధం రజనీ ట్రస్ట్ ఆధ్వర్యంలో బత్తలపల్లి సతీష్ వారి మిత్రులు ఆర్థిక సహకారంతో 25 కేజీల బియ్యం ప్యాకెట్టు ఒక నెలకు సరిపడే సరుకులను ఇవ్వడం జరిగిందని రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్టు నిర్వాహకులు కన్నా వెంకటేష్ తెలిపారు. పద్మావతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున, బత్తలపల్లి సతీష్ మాట్లాడుతూ మా కళాశాల విద్యార్థినికి ఇటువంటి సహకారం అందించడం పట్ల వారు ట్రస్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కెతా లోకేష్, చంద్రశేఖర్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ..
- Advertisement -
RELATED ARTICLES


