Homeజిల్లాలుతిరుపతియక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం

యక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం

- Advertisement -

విశాలాంధ్ర – గూడూరు: ప్రముఖ కలంకారి ఆర్టిజన్ యక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం లభించింది. పి 4 మార్గదర్శకుల మహోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రములో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని నిర్వాహకులు పీతాంబరధరావుకు అందజేశారు. విజయవాడ ఎంపీ కేశనేని శివనాథ్ ( చిన్ని) సారధ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చాంబర్ ఆఫ్ రియాల్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ రంగంలో రాణిస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కళాకారులు వివిధ రంగాలలో ప్రతిభ కనపరుస్తున్న వారిని సత్కరించారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షులు డాక్టర్ కీర్తి బొల్లినేని, ప్రముఖ యాంకర్ ఉదయభాను మరియు ఛాంబర్ ఆఫ్ రియాల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అత్తులూరి నాగమల్లేశ్వరరావు చేతుల మీదగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు