జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయుడు, జూడో రెడ్డప్ప, కోచ్ ఇనాయత్ భాష
విశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 19, 20,21 వ తేదీలలో కర్నూల్లోని కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జూడో అసోసియేషన్ క్యాడేట్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలు స్టేట్ సెక్రటరీ వెంకట్ నామిశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని జీవి ఈ జెడ్పి హై స్కూల్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు జి.యువ సంధ్య, జి.సుష్మిత జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందని కోచ్ ఇనాయత్ భాషా తెలిపారు. ముఖ్య అతిథులు డిఎస్పి మహబూబ్ బాషా, సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు స్పోర్ట్స్ కోటాలో మూడు శాతం రిజర్వేషన్ ఉండటం వల్ల చదువుతోపాటు క్రీడల రంగంలో పిల్లలకు ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని తెలుపుతూ సర్టిఫికెట్లు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని తెలిపారు. అనంతరం కోచ్ వినాయక భాష అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. జూడో క్లబ్ విద్యార్థులు బంగారు పతకాలను సాధించిన విద్యార్థులను కలకత్తాలో జరిగే జాతీయస్థాయి జూడో పోటీలకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు.
జీవి ఈ జెడ్పి హై స్కూల్ విద్యార్థినీలు జూడో జాతీయ స్థాయికి ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


