- Advertisement -
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలక బాల రామాంజనేయులు ఉరవకొండ పట్టణంలో పాండురంగ అనాధ ఆశ్రమంలో బుధవారం అనాధలకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొలక రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి క్రిస్మస్ పండుగకు అనాధలకు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈసారి కూడా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. అనాధలు వృద్ధులు అందరు కూడా క్రిస్మస్ పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి క్రీస్తు యొక్క ఆశీస్సులు ఉండాలని తెలిపారు.


