పాఠశాల డీడ్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఋషి విద్యాలయ విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ9వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లా షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్ ఉ 2026 | సబ్ జూనియర్ బాలురు & బాలికలు లకు ఫిబ్రవరి 14వ, 15వ తేదీలలో పల్నాడు జిల్లా, సత్తెనపల్లి లో నిర్వహించనున్న అంతర్ జిల్లా షూటింగ్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలలో రిషి విద్యాలయ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ పోటీలలో 7వ తరగతి విద్యార్థులు అయిన ఎస్.వి. సిరి, కె. దక్ష, ఏ. హర్షిత, కె. ధర్మేంద్ర రెడ్డి, పి. షణ్ముఖ్ కుమార్ రెడ్డి, ఎం. ధరణేష్ రెడ్డి పాల్గొంటున్నారు అని తెలిపారు. నిక్రీడలు విద్యార్థుల శారీరక-మానసిక వికాసానికి ఎంతో అవసరమని అన్నారు.సి.ఏ.ఓ రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థులు ధైర్యంగా ఆడి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ కరణ్ స్వరూప్ సింగ్ క్రమశిక్షణతో, పట్టుదలతో ఆడితే విజయం సాధ్యమని పేర్కొన్నారు.
వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి విద్యార్థుల ప్రతిభపై విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతరం ఏ.ఓ రంగారెడ్డి , ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొనే క్రీడాకారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు రిషి విద్యాలయ విద్యార్థుల ఎంపిక
- Advertisement -
RELATED ARTICLES


