గత ఏప్రిల్ నెలలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరి అందరినీ షాక్ చేసింది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ధర లక్ష దాటుతుందని భయపడేలోగా.. జూన్ చివరకు లక్ష నుంచి 94 వేలకు పడిపోయింది. శుభకార్యాలకు ఆభరణాలు కొనాలనుకునేవారు ఊపిరి పీల్చుకున్నారు. పది రోజుల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 99 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది.హైదరాబాద్ లో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,750 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,000 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,250 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,010 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,760 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,260 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


