Homeజాతీయంపుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. ఓటర్లకు నీల స్వాగతం..

పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో రోబో సందడి.. ఓటర్లకు నీల స్వాగతం..

- Advertisement -

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో వినూత్న దృశ్యం ఓటర్ల దృష్టిని ఆకట్టుకుంది.
ఓ పోలింగ్ కేంద్రంలో నీల అనే హ్యూమనాయిడ్ రోబో సంప్రదాయ చీరకట్టులో కనిపిస్తూ, ఓటర్లకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజాస్వామ్య పండుగలో సాంకేతికతను కలిపిన ఎన్నికల సంఘం ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తోంది.

రోబోతో సందడి వాతావరణం
గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఆ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సందడి కనిపించింది. కేంద్రానికి వచ్చే ప్రతి ఓటరిని నీల రోబో చేతులు జోడించి నమస్కరిస్తూ ఆహ్వానిస్తోంది.
ఃఓటు వేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఓటు హక్కును తప్పక వినియోగించుకోండిః అంటూ సందేశం ఇస్తూ ఓటర్లలో చైతన్యం కలిగిస్తోంది.
యువతలో ఆసక్తి
ఈ కొత్త ప్రయత్నం చూసి ఓటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా యువత నీల రోబోతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.

ఓటింగ్ శాతం పెంపుదల లక్ష్యం
ఓటింగ్ శాతాన్ని పెంచడం, ఓటర్లలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఎన్నికల సంఘం ఈ వినూత్న ఆలోచనను అమలు చేసింది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరుతూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు