Homeక్రీడలురోహిత్ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు: రవి శాస్త్రి

రోహిత్ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు: రవి శాస్త్రి

- Advertisement -

క్రీడలు: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ పుకార్లపై క్రికెట్ దిగ్గజం, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రవిశాస్త్రి స్పందించాడు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే రోహిత్కు చివరి వన్డే అంటూ పుకార్లు చెలరేగిన నేపథ్యంలో లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో 138 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే. తనలో ఉన్న సత్తాకు ఈ ఇన్నింగ్స్‌ గట్టి సమాధానమని రవి శాస్త్రి పేర్కొన్నాడు. గత కొంతకాలంగా వన్డే ఫార్మాట్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలుకన్నుాడంటూ నెట్టింట వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లోనూ అతడికి స్థానం లేదని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ సెంచరీ చేసి అందరికీ బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడంటూ రవి శాస్త్రి వెల్లడించాడు. ‘రోహిత్ శర్మ ప్రత్యేకంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అతడిపై వస్తోన్న పుకార్లు, విమర్శలకు బ్యాట్తోనూ సమాధానం చెప్పాడు. తన సెంచరీతో అందరి నోళ్లు మూయించాడు. అయినా ఇలాంటి పుకార్లు వస్తే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. అతడికి ఇంకా ఆడాలనే కోరిక, ఆటపై ఆసక్తి, కష్టపడే తపన ఉంటే…ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆడే అవకాశం ఇవ్వాలి. ఒక రోజు రోహిత్ స్వయంగా జట్టును వీడేందుకు సరైన సమయం ఇదేనంటూ భావిస్తాడు. అప్పుడు మాత్రమే అతడు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి నాణ్యమైన ఆటగాడిని జట్టు నుంచి తప్పించాలనుకునే సమయంలో అతడు ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడటం ప్రత్యేకం. లార్డ్స్‌లో వచ్చిన ఈ వన్డే సెంచరీ చాలా గొప్పది’ అని శాస్త్రి ప్రశంసించాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు