Homeఆంధ్రప్రదేశ్లయన్స్ సేవలకు సలాం

లయన్స్ సేవలకు సలాం

- Advertisement -
  • రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె.పూర్ణ చంద్రరావు

విశాలాంధ్ర – శ్రీకాకుళం :లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం స్థానిక బృందావనం ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా జరిగింది. పూర్వపు గవర్నర్ డిఎస్ఎస్వి.వర్మ, ప్రస్తుత గవర్నర్ కె.వి. సుబ్బరాజు, నున్న శ్రీనివాస రావు నేతృత్వంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలిగా ప్రముఖ వైద్యురాలు లయన్ పైడి సింధూర బాధ్యతలు అందుకోగా, కొత్త కార్యవర్గంలో టెక్కం రామ్ గోపాల్ (సెక్రటరీ), బరాటం కృష్ణ చైతన్య (ట్రెజరర్), ఇతర ఎంసీ సభ్యులు, నూతన సభ్యులు ప్రమాణస్వీకరణ చేశారు. ముఖ్య అతిథిగా..రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జె.పూర్ణ చంద్రరావు పాల్గొని మాట్లాడుతూ లయన్స్ నిర్విరామ, నిస్వార్ధ సేవలకు సలాం అని, సింధూర అధ్యక్షతన విలువలుగల సేవలు కొనసాగించి స్ఫూర్తిప్రదాతగా నిలవాలన్నారు. పూర్వపు గవర్నర్ డిఎస్ఎస్వి.వర్మ, ఉప గవర్నర్ నున్న శ్రీనివాస రావు లు మాట్లాడుతూ సింధూర బృందం సేవా కార్యక్రమాలతో ముందుకుసాగాలన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ లో కీలకంగా వ్యవహరించే..లయన్స్ ఇంటర్నేషనల్ ను ముందుకు నడిపించే … నటుకుల మోహన్, పొన్నాడ రవి కుమార్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతల నిర్వహణలో భాగంగా అంతా కలిసి పనిచేస్తూ ముందుకువెళ్తామన్నారు. అనంతరం అధ్యక్షురాలు పైడి. సింధూర మాట్లాడుతూ సమాజానికి అవసరమైన అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలలో మార్పు తెస్తానని, ముఖ్యంగా యువతను చైతన్యపరుస్తామన్నారు. ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రత్యేక ద్రుష్టి సారిస్తామని, కాన్సర్ రహిత జిల్లాగా నడిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఇతర సేవాసంస్థల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, వక్తలు హాజరు అయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు