విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కీలకమైన పరిణామంగా, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బీ.టి.నాయుడుని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.రాష్ట్ర లెజిస్లేచర్ జనరల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఈ నియామక ఉత్తర్వులను విడుదల చేశారు.శాసనసభ సభ్యుల అధికారాలు, హక్కులకు సంబంధించిన అంశాలను పరిశీలించి, తగిన సిఫార్సులు చేయడంలో ప్రివిలేజ్ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో బీ.టి.నాయుడు అనుభవం, శాసనపరమైన పరిజ్ఞానం కమిటీ పనితీరును మరింత బలోపేతం చేయనున్నది.తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు,లోకేష్‌్, అసెంబ్లీ జనరల్‌సెక్రేటరి ప్రసన్నకుమార్‌కు బీటీ నాయుడు కృతజఞతలు తెలిచేశారు.
ఎమ్మెల్సీ బీ.టి.నాయుడుకి మరో అవకాశం
- Advertisement -
RELATED ARTICLES


