Monday, November 17, 2025
Homeఆంధ్రప్రదేశ్దసరా ఉత్సవాలు 11 రోజులు

దసరా ఉత్సవాలు 11 రోజులు

- Advertisement -

  • సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకు…
  • సెప్టెంబరు 29న మూలానక్షత్రం
  • ఆ రోజు దుర్గమ్మకు పట్టవస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సంబంధించి పోస్టర్ ను ఆలయ ఈవో శీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు సోమవారం ఆవిష్కరించారు. ఈ ఏడాది కూడా దసరా మహోత్సవాలు ప్రతి ఏడాది లానే బ్రహ్మాండంగా నిర్వహిస్తాం ఈవో శీనా నాయక్ తెలిపారు.సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయన్నారు.ఈ ఏడాది11 రోజుల పాటు విశేషంగా దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు.ప్రతి రోజు సాయంత్రం నగరోత్సవాలు జరుగుతాయన్నారు. మూలా నక్షత్రం సెప్టెంబర్ 29 వ తేదీ సోమవారం రోజున వచ్చిందన్నారు.మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో శీనా నాయక్ తెలిపారు. అక్టోబర్ 2 వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుంది.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, దేవాదాయ శాఖ, అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహిస్తామన్నారు. సామాన్యులకు పెద్దపీట వేస్తూ అందరికీ దుర్గమ్మ దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అమ్మవారి అలంకారాలు…

22వ తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి

23వ తేదీ శ్రీ గాయత్రి దేవి

24వ తేదీ శ్రీ అన్నపూర్ణ దేవి

25 వ తేదీ శ్రీ కాత్యాయిని దేవి

26 వ తేదీ శ్రీ మహా లక్ష్మీ దేవి

27 వ తేదీ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

28 వ తేదీ శ్రీమహా చండీ దేవి

29 తేదీ శ్రీ మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి

30 వ తేదీ శ్రీ దుర్గా దేవి

1వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి

2 వ తేదీ విజయదశమి రోజున
శ్రీ రాజరాజేశ్వరి దేవి

11 రోజులు 11 దివ్య అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు