అపోలో మెడిస్కిల్స్ ద్వారా ఎంబిబిఎస్ యాస్పిరెంట్స్‌కు అద్భుత అవకాశం
విశాలాంధ్ర – రాజమహేంద్రవరం సిటీ ; నీట్ పరీక్షలో పాసై , సీటు పొందలేని విద్యార్ధులు ఇక నుంచి బాధ పడనవసరం లేదు.. మీరు నీట్ పాసైతే చాలు అన్ని సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో మీరు ఎంబిబిఎస్ పూర్తి చేయవచ్చంటున్నారు అపోలో మెడ్ స్కిల్స్ అఫీషియల్ ఎన్ రోల్ మెంట్ పార్టనర్ అలీ. నేడు దేశంలో ఏటా 25 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారని, వారిలో సుమారు 13 లక్షల మందే క్వాలిఫై అవుతున్నారని, వారిలో కూడా కేవలం లక్షకు మించి విద్యార్ధులకు సీట్లు రావడం లేదన్నారు. ఈ సమస్యను గుర్తించి, నీట్ పాసై ఎంబిబిఎస్ చదువు కొనసాగించాలనుకునే విద్యార్ధులు అపోలో మెడిస్కిల్స్, డువెంటస్ ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉజ్బెకిస్తాన్ లోని జార్మెడ్ విశ్వ విద్యాలయంలో హేపీగా ఎంబీబిఎస్ చదువుకోవచ్చన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక శ్రీ కన్య గ్రాండ్ సమావేశ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా కేవలం 35 లక్షలకు ఆరు సంవత్సరాల ఎంబిబిఎస్ ప్రోగ్రామ్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఉజ్బెకిస్తాన్ దేశం ప్రశాంతమైన దేశమని, భారత్ తో కూడా ఆ దేశానికి మంచి సంబందాలున్నాయని, వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. దీనికి తోడు ఢిల్లీ నుంచి కేవలం రెండున్నర గంటల వ్యవధిలో ఆ దేశానికి వెళ్ళొచ్చన్నారు. దేశంలో ఎంబిబిఎస్ యాస్పిరెంట్స్ తమ డాక్టర్ కలను నిజం చేయడానికి అపోలో సంస్థ సహకారంతో అపోలో మెడిస్కిల్స్ పేరుతో తాము ప్రాజెక్టు చేపట్టామన్నారు. నీట్ లో ర్యాంకు వచ్చి , ఎంబిబిఎస్ చేయాలనుకునే విద్యార్ధులు అతి తక్కువ ఖర్చుతో తమ ఎంబీబిఎస్ పూర్తి చేయవచ్చన్నారు. గతంలో విదేశాలలో ఎంబీబిఎస్ విద్యను అభ్యసించిన విద్యార్ధులు ఎఫ్ ఎంజిఈ రాయాల్సి వస్తుందని, కానీ దానిలో పాస్ పర్సంటేజ్ కేవలం ఆరు నుంచి 20 శాతం వరకు మాత్రమే ఉందన్నారు. అలాగే 2025 బ్యాచ్ నుంచి భారత ప్రభుత్వం కూడా నెక్ట్స్ (ఎన్ ఈ ఎక్స్ టీ) అనే పరీక్ష పెడుతుందని, అందులో పాసైన విద్యార్ధులకు మాత్రమే మన దేశంలో ప్రాక్టీసు చేసే అవకాశం ఉంటుందన్నారు. కనుక తమ సంస్థ ద్వారా చదువుకునే విద్యార్ధులకు, ఎఫ్ ఎంజిఈ , నెక్ట్స్ పరీక్షలలో సులువుగా పాసయ్యేందుకు వీలుగా తాము విద్యార్ధులకు శిక్షణనిస్తామన్నారు. అలాగే, అక్కడ విద్యార్ధులకు పాఠాలు బోధించడానికి ఇండియన్ ప్రొఫెసర్లను ఏర్పాటు చేస్తున్నామని, మన వంటకాలకు అనుగుణంగా ఇండియన్ చెఫ్‌లను కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కనుక మన దేశ విద్యార్ధులు తమ సంస్థ ద్వారా చాలా సులువుగా ఎంబీబిఎస్ చదువుకోవచ్చని, అతి తక్కువు ఖర్చుతో డాక్టర్ల కావచ్చన్నారు. జార్మెడ్ యూనివర్శిటీకి చెందిన అడ్మిషన్ ఆఫీసు జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నెంబర్ 36లో ఉందని, ఇతర వివరాల కోసం 9160022009, 9849122588 అనే నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన కెఆర్ కె రాజు, ఎఎస్ఎన్ రాజు, వి. రమేష్‌లు పాల్గొని విలేకరుల సందేహనివృత్తి చేశారు.


