శ్రీ సత్యసాయి జిల్లా డిఐఈఓ- రఘునాథరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం:: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం మంది పెంచడమే సంకల్ప-2025 లక్ష్యము అని శ్రీ సత్యసాయి జిల్లా డిఐఈఓ రఘునాథ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత శాతమును పెంచడం కోసం ఈ వినూత్నమైన కార్యక్రమమును ఇంటర్మీడియట్ ఆదేశాల మేరకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఏడెడ్ జూనియర్ కళాశాలలో చదువుతున్న వారిని, చదువులో వెనుకబడిన వారిని మూడు విభాగాలుగా విభజించి వారి కోసం అధ్యాపకులను కేకలుగా నియమించడం జరిగిందన్నారు. ఈనెల రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి నెల చివరి వరకు మొత్తం 22 కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ 3,872 మందికి, రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ 3,063 విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులను ఏ, బి, సి గ్రూపులుగా విడదీసి ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుండి 5 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. వీరందరికీ ప్రత్యేకంగా టైం టేబుల్ ఏర్పాటు చేసి, ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు మంచి అవగాహన విద్య యందు ప్రాధాన్యతను కొనసాగిస్తూ, ఉత్తీర్ణత శాతమును పెంచడానికి తగిన సూచనలు కళాశాల ప్రిన్సిపాల్ కూడా తెలపడం జరిగిందని తెలిపారు. ఈ సంకల్ప-2025 అనే ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రిన్సిపాల్ లు, కళాశాల అధ్యాపకులు చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తించాలని వారు తెలిపారు.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పెంచడమే సంకల్ప-2025 లక్ష్యం
RELATED ARTICLES