విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ నరేష్, పల్లవి ఆధ్వర్యంలో మంగళవారం మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మినీ ట్యాంకులో పేరుకుపోయిన పూడికను తీయించి, బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయించారు. గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు . గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకోరావాలని కోరారు. అనంతరం పారిశుధ్య పనులను చేపట్టారు.