Homeజిల్లాలుశ్రీ సత్యసాయిటీచర్ల టోర్నమెంటులో గెలుపొందిన సత్యసాయి జిల్లా జట్టు

టీచర్ల టోర్నమెంటులో గెలుపొందిన సత్యసాయి జిల్లా జట్టు

- Advertisement -

ఎంఈఓ గోపాల్ నాయక్


విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 10వ తేదీన గుంటూరు డాక్టర్స్ గ్రౌండ్లో జరిగినటువంటి లీప్ టీచర్ల టోర్నమెంట్ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు పాల్గొనడం జరిగింది, సత్యసాయి జిల్లా జిల్లాస్థాయిలో గెలిచి గుంటూరులో విశాఖపట్నం, ఏలూరు పైన విజయం సాధించి ఫైనల్ లో ఫైనల్లో అనకాపల్లి జిల్లా పైన సత్యసాయి జిల్లా 137 రన్స్ చేసి విజయం సాధించడం జరిగింది అని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విషయంలో భాగస్వాములైనటువంటి ఎంఈఓ గోపాల్ నాయక్ , ఎస్ జి ఎఫ్ సెక్రటరీ లక్ష్మీనారాయణ మండల పిడీలు , ఎంఈఓ1 రాజేశ్వరి దేవి, ఎన్జీవోఆర్డిటి సంస్థ ఉపాధ్యాయునిన్లు ఉపాధ్యాయులు ఎం ఆర్ సి సిబ్బంది అందరూ చక్కగా సహకరించి టీం వర్క్ చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైంది అని వారు తెలిపారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో కీలక పాత్ర పోషించిన హరీష్ ,రాము సందీప్, ఆనంద నాయక్, వెంకటేష్ నాయక్, అంజి నాయక్, అశోక్, రామాంజనేయులు, వేమ, రఫీ మొదలగు వారు పాల్గొని చక్కగా ఆటను ప్రదర్శించారు. ముఖ్యంగా సత్య సాయి జిల్లా గురించి కమిషనర్ విజయరామరాజు , ఎస్ పి డి బి శ్రీనివాసరావు , స్కూల్ గేమ్ ఫెడరేషన్ భానుమూర్తి, భుజంగరావు, శ్రీధర్ , రాధాకృష్ణ ,చక్కగా ఆర్గనైజ్ చేసి మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , లోకేష్ ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యాయుల కేవలం పాఠాలతో పాటు వ్యాయామ విద్యల్లో కూడా విద్యార్థులను శారీరకంగా మానసికంగా దృఢంగా చేర్చిదిద్దుతామని తెలిపారు. అదేవిధంగా విజయరామరాజు కమిషనర్ ఆదేశాల ప్రకారం మండలంలో ఉన్నటువంటి గ్రౌండ్లను జాతీయస్థాయిలో ఆడేటట్లు తీర్చి దిద్దుతామని తెలిపారు. క్రీడాకారులు అందరికీ కూడా ఆరోగ్య విద్యాశాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ తరపున హరీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు