Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాకృష్ణాజలాల పైపులైన్ల పనుల్లో తీవ్ర జాప్యం

కృష్ణాజలాల పైపులైన్ల పనుల్లో తీవ్ర జాప్యం

- Advertisement -


కిడ్నీ బాధితుల ప్రాణాలు కాపాడండి

ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వం..

ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రకు ఏడాది పూర్తి...

సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ …
విశాలాంధ్ర` ఏ కొండూరు: రాష్ట్రంలో మరో ఉద్దానం కాకముందే జిల్లాలోని ఏ కొండూరు మండలం కిడ్నీ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు శుద్ధి చేసిన కృష్ణా జలాలు అందించాలని సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రతో ప్రభుత్వం దిగివచ్చి వాగ్దానం చేసి సంవత్సరం గడిచిన ఈనాటికి కృష్ణా జలాల సరఫరా పైపులైన్‌ పనులు వేగవంతంగా జరగడంలేదని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి కుదప నుంచి ఏ కొండూరు వరకు వేస్తున్న పైపులైన్లు పనులు వేగవంతంగా పూర్తి చేసి కిడ్నీ బాధితుల సమస్య కు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో కిడ్నీ మహమ్మారి సోకి బాధితులు చనిపోతుంటే. రాష్ట్ర ప్రభుత్వం చలనం లేకుండా మీనమేషాలు లెక్కిస్తుందని వ్యాధి తీవ్రత తొలినాళ్లలోనే మండలంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఐ డిమాండ్‌ చేసిందని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో గత సంవత్సరం 2024 ఆగస్టు నెల 27, 28, 29 తేదీలలో ఏ కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వరకు కిడ్నీ బాధితులతో ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ కే రామకృష్ణ పాదయాత్రను ప్రారంభించారని తెలిపారు. ఈ మూడు రోజులపాటు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 29వ తేదీ కిడ్నీ బాధితులతో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ను కలిసి సమస్య తీవ్రతను వివరించడం జరిగిందని తెలియజేశారు. శుద్ధిచేసిన కృష్ణా జలాలు ఏ కొండూరు తరలించడానికి కేంద్ర జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.50 కోట్లు మంజూరైనా ఇంకా పనులు నత్తనడక సాగుతున్నాయని జూన్‌ మాసంలోనే కృష్ణాజలాలు అందిస్తామని ప్రగల్బాలు పలికిన రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎద్దేవా చేశారు. సీపీఐ పోరాట ఫలితంగా మండలంలో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నా అవి బాధితులకు అరకొరగానే అందుతున్నాయని పాదయాత్ర ప్రారంభించి నేటికి సంవత్సర కాలం పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే వ్యాధి తీవ్రత వల్ల ఆర్థిక స్తోమత లేని కిడ్నీ బాధితులు వందలాదిగా తమ విలువైన ప్రాణాలు కోల్పోయారని శుద్ధిచేసిన కృష్ణా జలాలు సకాలంలో అందించి ఉంటే చనిపోయేవారు కాదన్నారు. మరో ప్రాణం బలి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే సెప్టెంబర్‌ నాటికి శుద్ధిచేసిన కృష్ణా జలాలు ఏ కొండూరు మండలానికి అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మరోసారి పోరాటానికి సిద్దమవుతామని, అవసరమైతే తిరిగి పాదయాత్రను చేస్తామని హెచ్చరించారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు