Homeజిల్లాలుశ్రీ సత్యసాయినేత్రదానం చేసిన షీలా కంటయ్య.. రోటరీ క్లబ్ కార్యదర్శి విజయభాస్కర్

నేత్రదానం చేసిన షీలా కంటయ్య.. రోటరీ క్లబ్ కార్యదర్శి విజయభాస్కర్

- Advertisement -


విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు లో టీచర్ పరంధామయ్య సోదరుడు పాండు తండ్రి షీలా కంటయ్య అకస్మాత్తుగా ఆదివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నేత్రదానం చేసేందుకు రోటరీ క్లబ్ వారిని సంప్రదించారు. తదుపరి రోటరీ క్లబ్ వారు రెడ్ క్రాస్ సొసైటీ నుండి టెక్నీషియన్ రాఘవని పిలిపించి నేత్రదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధి నరేందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు మాట్లాడుతూ ఈ నేత్రదానం వల్ల ఇరువురికి చూపు కలుగుతుందని తెలిపారు. మనిషి మరణం తర్వాత ఏమిటికి కోరగాని శరీరం ఇద్దరూ అందులకు చూపు కలిగించే అవకాశం ఉందని తెలిపారు. ఇంతకు మించిన దాతృత్వం మరొకటి లేదని తెలిపారు. అనంతరం కంటయ్య కుటుంబ సభ్యులకు రోటరీ క్లబ్ కమిటీ వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం చేసి మృతి చెందిన కంటయ్యకు సంతాపం తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ శివయ్య, నేత్రదానం చేసిన కంటయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు