Homeఆంధ్రప్రదేశ్ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో షాకింగ్ విషయాలు.. వంటవాడి నిర్లక్ష్యంతో 21 మంది మృతి

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో షాకింగ్ విషయాలు.. వంటవాడి నిర్లక్ష్యంతో 21 మంది మృతి

- Advertisement -

దిల్లీలోని మాలవీయ నగర్‌లో ఉన్న ఓ హోటల్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది.ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 28 మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, శనివారం హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న 65 ఏళ్ల కేశవ్ నేగిని అరెస్ట్ చేశారు.దిల్షాద్ గార్డెన్‌కు చెందిన అతని నిర్లక్ష్యమే ఈ అగ్నిప్రమాదానికి కారణమైందని ప్రాథమిక విచారణలో తేలింది. జూన్ 3న మాలవీయ నగర్‌లోని హౌజ్ రాణి ప్రాంతంలో ఉన్న ఃఫ్లోరిష్ స్టే హోటల్ఃలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.ఐదు అంతస్తుల భవనం క్షణాల్లో మంటలకు ఆహుతి కావడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

భద్రతా లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
దర్యాప్తులో హోటల్ యాజమాన్యం చేసిన పలు నిర్లక్ష్యాలు, భద్రతా లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.అధికారుల ప్రకారం, హోటల్‌కు ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి అవసరమైన ఫైర్ ఎన్‌ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) లేదు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో ఉన్నవారు బయటపడేందుకు తగిన మార్గాలు కూడా లేవని గుర్తించారు.భవనానికి కేవలం ఒకే ప్రవేశ, నిష్క్రమణ ద్వారం ఉండటం, అన్ని కిటికీలను శాశ్వతంగా మూసివేయడం, ప్రధాన ద్వారం సెన్సార్ ఆధారంగా పనిచేయడం వల్ల పరిస్థితి మరింత విషమించింది.అగ్నిప్రమాదం సంభవించగానే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గేట్లు లాక్ అయ్యాయి. దీంతో లోపల చిక్కుకున్న వారు బయటకు రాలేక, ఊపిరాడక సజీవ దహనమయ్యారు.

పోలీసుల అదుపులో హోటల్ యజమాని
ఈ ప్రమాదంలో మరణించిన 21 మందిలో 10 మంది భారతీయులు ఉన్నారు. మరో తొమ్మిది మంది ఆఫ్రికా దేశాలకు చెందినవారు కాగా, ఇద్దరు తుర్క్మెనిస్తాన్ పౌరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో హోటల్ యజమాని లవ్‌కేష్ బజాజ్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బజాజ్ దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన పోలీసులు, గాలింపు చర్యల అనంతరం వారిని పట్టుకున్నారు. ప్రస్తుతం సాకేత్ కోర్టు లవ్‌కేష్ బజాజ్‌కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది.బజాజ్‌పై హత్యతో సమానమైన నేరపూరిత నరహత్య, అగ్నిప్రమాదానికి కారణమవడం, ఆస్తి నష్టం కలిగించడం, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి తీవ్ర ఆరోపణల కింద విచారణ కొనసాగుతోంది.

ఇద్దరు బంగ్లాదేశీ మహిళలు అరెస్టు
అంతేకాకుండా హోటల్ నిర్వహణతో పాటు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో కూడా అతడి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్రమ వలసల కేసులో కూడా బజాజ్ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బంగ్లాదేశ్‌కు చెందిన స్వీటీ సర్కార్, ఆమె కుమార్తె పుష్పో సర్కార్‌కు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని తన చత్తర్‌పూర్ నివాస చిరునామాను ఉపయోగించుకునేందుకు అనుమతించినట్లు తేలింది.
ఆ చిరునామా ఆధారంగా వారు నకిలీ భారతీయ గుర్తింపు కార్డులు, పాస్‌పోర్టులు పొందడంతో పాటు ఢిల్లీలో అక్రమంగా నివసిస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ కేసులో ఇప్పటికే లవ్‌కేష్ బజాజ్‌తో పాటు ఆ ఇద్దరు బంగ్లాదేశ్ మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు