Homeజాతీయంయూపీలో కాల్పుల కలకలం..

యూపీలో కాల్పుల కలకలం..

- Advertisement -

అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. అలీగఢ్ విశ్వవిద్యాలయం వద్ద నడకకు వెళ్లిన ఉపాధ్యాయుడి తలపై రెండు సార్లు కాల్చడంతో , అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన యూనివర్సిటీలో తీవ్ర కలకలం రేపింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని ఏబీకే హైస్కూల్‌లో కంప్యూటర్ సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయుడు డానిష్ రావు బుధవారం సాయంత్రం నడకకు వెళ్లారు. అతను ఇద్దరు సహోద్యోగులతో కలిసి నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతుంన్న సమయంలో రాత్రి 8:50గంటల సమయంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సమీపం నుంచి డానిష్ రావు తలపై రెండు,మూడు సార్లు కాల్పులు జరిపారు

సెంట్రల్ లైబ్రరీ సమీపంలో కాల్పులు
ఈ ఘటనలో అతను తక్షణమే ప్రాణాలు కోల్పోయాడు.దీంతో క్యాంపస్ అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం దుండగులు పరారయ్యారు. డానిష్ రావును వెంటనే జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి తరలించినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్ జాడోన్ తెలిపారు. ఆస్పత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.ఈ కాల్పులు విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ లైబ్రరీ సమీపంలో జరిగాయి. ఆరుగురు పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని,పరారైన హంతకులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రతి వ్యక్తికి భద్రతా ముఖ్యమని…ప్రతి వ్యక్తికి మెరుగైన భద్రతా వాతావరణం ఉండడంతోనే యూపీకి పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి యోగి అసెంబ్లీలో అన్నారు. కానీ ఆయన ప్రకటనకు కొద్ది గంటలకే ఈ ఘోర ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు