మనోబంధు ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్, అనూష
విశాలాంధ్ర ధర్మవరం:: మతిస్థిమితం కోల్పోయిన వారి మీద మానవతను చూపించాలని మనో బంధు ఫౌండేషన్ నిర్వాహకులు సురేష్ ,అనూష తెలిపారు. ఈ సందర్భంగా వారు కడప నుంచి అంబులెన్స్ తో పాటు ధర్మవరానికి చేరుకున్నారు. పట్టణములో వివిధ చోట్ల మతిస్థిమితం లేని వారిని గుర్తించి, ఇద్దరినీ అంబులెన్స్ ద్వారా వారి ఆరోగ్య నిమిత్తం బాగుపరచడానికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న వారి జాడ మాకు తెలియజేయండి, తాము ఆసుపత్రిలో చేర్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో గాని పట్టణాలలో గాని నగరాలలో గాని మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఆదరించే వారు ఎవరు లేక, నిరాశ్రయలై రోడ్లపైన తిరుగుతున్న మనుషులను తప్పక గుర్తించి మాకు సమాచారం అందించాలని తెలిపారు. మా సంస్థ 2021లో స్థాపించబడిందని తెలిపారు. తాము రెడ్ క్రాస్ సంస్థతో మా బంధాన్ని ఏర్పరచుకుందామని తెలిపారు. మతిస్థిమితం లేని వారు ఎక్కడైనా కనపడితే సెల్ నెంబర్ 9246563738కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు బోనాల శివయ్య పాల్గొన్నారు.
మతిస్మితం కోల్పోయిన వారి మీద మానవతను చూపించండి..
- Advertisement -
RELATED ARTICLES


