Homeజాతీయంసీఏబీ అధ్యక్షుడిగా మరోసారి సౌరవ్ గంగూలీ..

సీఏబీ అధ్యక్షుడిగా మరోసారి సౌరవ్ గంగూలీ..

- Advertisement -

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ తిరిగి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే గంగూలీ ఈ పదవిలో ఉన్నారు.ఆరేళ్ల తర్వాత మళ్లీ ఆయన అదే పదవికి తిరిగి రావడం ప్రత్యేకం.అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే గంగూలీ ఒక సంచలన నిర్ణయం ప్రకటించారు.సోమవారం జరిగిన సీఏబీ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.2015 నుండి 2019 వరకు సీఏబీ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.ఆయన తర్వాత అవిషేక్ దాల్మియా సీఏబీ అధ్యక్షుడిగా కొనసాగారు.ఇప్పుడు గంగూలీ మళ్లీ సొంత గడ్డపై తన క్రికెట్ యాత్రను కొనసాగించనున్నారు.

టెస్ట్ క్రికెట్‌పై దృష్టి పెట్టిన గంగూలీ
అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే గంగూలీ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంపై దృష్టి పెట్టారు.
స్టేడియం కెపాసిటీని లక్ష వరకు పెంచే ప్రణాళికపై పని ప్రారంభిస్తామని ఆయన ప్రకటించారు.
వచ్చే ఏడాది జరగనున్నటీ20 ప్రపంచ కప్ తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని చెప్పారు.
కెపాసిటీ పెంపు సమయం తీసుకుంటుంది,ఇది సుదీర్ఘ ప్రక్రియ అని గంగూలీ వివరించారు.
అదనంగా, టీ20 ప్రపంచ కప్‌లోని ముఖ్య మ్యాచ్‌లను ఈడెన్ గార్డెన్స్‌లో నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని కూడా ఆయన చెప్పారు.అధ్యక్షుడిగా రాగానే గంగూలీ టెస్ట్ క్రికెట్‌పై కూడా దృష్టి పెట్టారు.
ఈడెన్ గార్డెన్స్‌లో టెస్ట్ మ్యాచ్‌లు సజావుగా జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అక్టోబర్‌లో ఇక్కడ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు, నవంబర్‌లో భారత్-సౌతాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది.

గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పింక్ బాల్ డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభం
ఈ టెస్ట్ మ్యాచ్ గురించి గంగూలీ మాట్లాడుతూ ఇది మంచి టెస్ట్ మ్యాచ్ అవుతుంది. ఇటీవల సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈడెన్ గార్డెన్స్‌లో మంచి పిచ్‌లు, నిస్సందేహంగా అద్భుతమైన మౌలిక సదుపాయాలు, మంచి ప్రేక్షకులు ఉంటారు. రెండు జట్లు ఫామ్‌లో ఉన్నందున మ్యాచ్ అద్భుతంగా ఉంటుందిఁ అన్నారు.గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారతదేశంలో పింక్ బాల్ డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి.

బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో సీఏబీ తరపున గంగూలీ
2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ బాల్ టెస్ట్ తర్వాత, ఇప్పుడు ఇక్కడ మరో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
బీసీసీఐలోని కొత్త సభ్యులతో త్వరలోనే చర్చిస్తానని గంగూలీ తెలిపారు. బీసీసీఐ కొత్త సభ్యులతో నేను మాట్లాడతాను. కొత్త బీసీసీఐ అధ్యక్షుడికి నా శుభాకాంక్షలు. అతను మంచి పని చేస్తాడని నమ్ముతున్నానుఁ అని చెప్పారు.సెప్టెంబర్ 28న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో సీఏబీ తరపున గంగూలీ ప్రాతినిధ్యం వహిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు