Thursday, May 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం..

నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం..

నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర -ధర్మవరం; ధర్మవరం ఎన్డీఏ (బీజేపీ) కార్యాలయంలో సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యులు కరస్పాండెంట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు అధ్యక్షత వహించారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు విద్యా రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో కళాశాలలు ముందుకు రావాలని ఆయన కోరారు. అలాగే, విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఫీజుల విషయంలో కొంత వెసులుబాటు చూపించే దిశగా యాజమాన్యాలు చొరవ చూపాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని, నాణ్యతతో కూడిన బోధన, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా, ధర్మవరం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలో ప్రతి విద్యా సంస్థ తమ వంతు పాత్రను పోషించాలని, విద్య ద్వారా సమాజానికి సేవ చేయడంలో భాగస్వాములవ్వాలని హరీష్ బాబు ఆకాంక్షించారు. సమావేశంలో పాల్గొన్న కళాశాలల ప్రతినిధులు ఈ సూచనలను హర్షంగా స్వీకరించి, ప్రభుత్వంతో కలిసి విద్యా ప్రమాణాల పెంపుకు కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు