Homeజిల్లాలుఅనంతపురంపవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు…

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు…

- Advertisement -

విశాలాంధ్ర-నార్పల (అనంతపురం జిల్లా) : – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడంతో నార్పల మండలంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు.
జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలు, జనసైనికులు, అభిమానులందరూ ఆయన త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, తుపాకుల భాస్కర్, షేక్ రహంతుల్లా, గూగూడు ఆలయ కమిటీ సభ్యుడు టి. సురేష్, చంగా అశోక్, వినోదం లోకేష్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు