Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపదవ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన స్టడీ అవర్స్..

పదవ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన స్టడీ అవర్స్..

- Advertisement -

హెడ్మాస్టర్ పూల పద్మావతి
విశాలాంధ్ర ధర్మవరం;;2026-27 విద్యా సంవత్సరం కుగాను పదవ తరగతి విద్యార్థులు మంచి ప్రతిభతో ముందుకు వెళుతూ చక్కటి ఫలితాలను సాధించేందుకు జూలై 13 వ తేదీ నుండి పరీక్షలు ముగిసే వరకు స్టడీ అవర్స్ ను కొత్తపేటలోని ఎస్ పి సి ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించడం జరిగిందని హెడ్మాస్టర్ పూల పద్మావతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ స్టడీ అవర్స్ సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీంతో తొలి రోజున తెలుగు స్టడీ అవర్స్ ను ఆదినారాయణ చేత ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ స్టడీ అవర్స్ విషయాన్ని తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. మా ఉపాధ్యాయుల కృషితో పదవ తరగతి పరీక్షా ఫలితాలను మంచి రిజల్ట్ గా తెస్తామని వారు భరోసాగా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు