Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచేనేత జౌలి శాఖ మంత్రి సవిత నేతన్న భరోసా పథకం తేదీని వెంటనే ప్రకటించాలి

చేనేత జౌలి శాఖ మంత్రి సవిత నేతన్న భరోసా పథకం తేదీని వెంటనే ప్రకటించాలి

- Advertisement -

ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండు
విశాలాంధ్ర ధర్మవరం : చేనేత జౌళి శాఖ మంత్రి సవిత నేతన్న భరోసా పథకం తేదీని వెంటనే ప్రకటించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జె వి రమణ, చేనేత జిల్లా నాయకులు ఎస్ హెచ్ భాష డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ .చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు మా ప్రభుత్వం నేతన్న భరోసా పథకం ద్వారా ప్రతి చేనేత కార్మికునికి 25 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగినదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ చేనేత కార్మికులకు చేనేత భరోసా పథకం అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు అనేక రకాల కష్టాల్లో, నష్టాల్లో ఉన్నారని చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం అమలు అయితే కొంత ఊరటగా ఉంటుందని తెలిపారు. కానీ రాష్ట్రబడ్జెట్లో చేనేత కార్మికులకు బడ్జెట్ కేటాయించలేదని , కానీ చేనేత జౌలీ శాఖ మంత్రివర్యులు త్వరలో చేనేత భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించడం జరిగినదని తేదీని ప్రకటించకుండా త్వరలో అనడం చేనేత కార్మికులను మభ్యపెట్టడం తప్ప మరొకటి కాదని తెలిపారు .కనీసం ఆగస్టు ఏడో తారీఖున చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకమును అమలు చేయాలని అదే విధంగా చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలమున కేటాయించి, వర్క్ షెడ్ తో కూడిన ఇంటిని నిర్మించి ఇవ్వాలని, స్వంత స్థలం ఉన్న వారికి ఆరు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా ఇవ్వాలని, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఈ రెండు సంవత్సరాలలో ఒక్క చేనేత కార్మికునికి కూడా చేనేత పింఛన్ మంజూరు చేయలేదని మండిపడ్డారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును చేనేత అనుబంధ వృత్తుల వారికి కూడా అమలు చేయాలని తెలిపారు.చేనేత కార్మికుల అనేక రకాల సమస్యల పరిష్కారం జూలై 20వ తేదీ ధర్మవరం ఆర్ డి ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు
కావున ప్రతి చేనేత కార్మికుడు ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని వారి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఖాదర్బాషా గుంపు హరి, సిఐటియు నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు