- Advertisement -
విశాలాంధ్ర – పాయకరావుపేట: మండలంలోని శ్రీరాంపురం గ్రామంలో సర్పంచ్ గారా కృష్ణ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వై.సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. గ్రామంలోని రాజగోపాలపురానికి వెళ్లే రోడ్డులో ప్రభుత్వ పాఠశాలల వద్ద నిత్యం చెత్తా చెదారంతో నిండి ఉండేది. ఎన్నిసార్లు శుభ్రం చేయించిన ఆ ప్రాంత ప్రజలు అక్కడనే చెత్త వేసి, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై స్పందించిన సర్పంచి, పంచాయతీ కార్యదర్శి అక్కడ చెత్తను తొలగించి, గ్రీన్ క్లాత్ లు ఏర్పాటు చేసి, చెత్త వెయ్యవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.


