Homeజిల్లాలుశ్రీ సత్యసాయిక్రీడలు శరీర దృఢత్వంతో పాటు చక్కటి ఆరోగ్యాన్నిస్తాయి

క్రీడలు శరీర దృఢత్వంతో పాటు చక్కటి ఆరోగ్యాన్నిస్తాయి

- Advertisement -

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం; క్రీడలు శరీర దృఢత్వంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని మంత్రి నియోజకవర్గం ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తారకరామాపురం క్రీడా మైదానంలో పది రోజులుగా జరుగుతున్న క్రీడా కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కోచ్ రాజశేఖర్ ,పృద్వి మాట్లాడుతూ తారకరామపురం,క్రీడా కేంద్రంలో 10 రోజులుగా జరుగుతున్న స్కూల్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్స్ తోముగిశాయి అని తెలిపారు. కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్స్ బాలికల విభాగంలో ఎంపీఎల్ బాలికలు ఉన్నత పాఠశాల కొత్తపేట విజేతలు కేజీబీవీ బాలికల పాఠశాల రన్నర్స్ కాగా, బాలుర విభాగం లో మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల కొత్తపేట విజేతలు జడ్పీ హైస్కూల్ గొట్లూరు రన్నర్స్ , క్రికెట్ టోర్నమెంట్ లో బాలికల విభాగంలో మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల కొత్తపేట విజేతలు ఏపీ మోడల్ స్కూల్ రన్నర్స్, బాలుర విభాగం లో మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల కొత్తపేట విజేతలు ఏపీ మోడల్ స్కూల్ రన్నర్స్ గా నిలిచాయి అని తెలిపారు.అనంతరం విజేతలకు హరీష్ బాబు చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్లు రాంప్రసాద్ , పద్మశ్రీ , వివిధ పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు