కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం : ప్రతి ఒక్కరూ మానవసేవను అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను వైద్యులు, నర్సుల చేతుల మీదుగా అందజేశారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి ఈ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి సేవా సమితి వారే దాతగా వ్యవహరించడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ త్రిపేంద్ర నాయక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ సత్య సాయి సేవ సమితి వారు చేస్తున్న ఇటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు సహాయకులకు వీరి సేవ వరంగా మారిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి తరఫున వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మానవ సేవను అలవర్చుకోవాలి..
- Advertisement -
RELATED ARTICLES


