గణపతి సచ్చిదానంద జ్ఞాన బోధ సభ ట్రస్ట్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి 83వ జన్మదినోత్సవ వేడుకలను గణపతి సచ్చిదానంద జాన బోధ సభా ట్రస్టు, ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్లు, భక్తాదుల, అర్చకులు సుదర్శన చార్యులు, భాను ప్రకాష్ నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ దత్త శివ, మెడికల్ కుళ్లాయప్ప, రామాంజనేయులు, సాగా సురేష్, రంగా శ్రీనివాసులు, సంజీవులు, ఎస్డిహెచ్ఎస్ వాలంటీర్లు, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.