విశాలాంధ్ర -ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ తోపాటు 12 మంది శిష్యులకు గిన్నిస్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువు బాబు బాలాజీ మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ అనగా గురువారం హైదరాబాద్ కోటి లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో భారత్ అకాడమీ వారు 2023లో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో పేర్లు నమోదు అయిన వారికి గిన్నిస్ వరల్డ్ రికార్డులను మాకు గురువారం అందజేయడం జరిగిందని వారు తెలిపారు. నాతోపాటు 12 మంది శిష్యులకు వచ్చిన గిన్నిస్ రికార్డ్స్ పత్రాలను కూచిపూడి ప్రసిద్ధ గురువులు శేషుబాబు, సినీ, సీరియల్ నటి జ్యోతి రెడ్డి చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా బాబు బాలాజీ కుమార్తె రామా లాలిత్య ఇదే వేదిక మీద సినీ నటి జ్యోతి రెడ్డి చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా అందుకోవడం సంతోషదాయకమని తెలిపారు. శ్రీ లలిత నాట్య కళానికేతన్ సంస్థ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శిష్యులలో రామ లాలిత్య, ఉమా ప్రియా, తనులత, హు షిత, వేద ప్రజ్ఞ, లీలా మాధవి, జాహ్నవి, వైష్ణవి, అదిత్రీ, ఉదయశ్రీ, సహస్ర ఉన్నారని తెలిపారు. ఇటువంటి అవకాశం రావడం మా సంస్థ ద్వారా మాకు మా చిన్నారులు సహాయ సహకారాలు అందిస్తూ, సంస్థకు ఒక మంచి గుర్తింపు రావడం అందరి ఆశీస్సులు అని వారు తెలిపారు. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం మాకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని, ఇది కళాఖండానికి అంకితమిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వాహకులు గురువు బాబు బాలాజీని ఘనంగా సన్మానించారు.
శ్రీ లలిత నాట్య కళానికేతన్ వారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కైవసం
RELATED ARTICLES