Monday, April 21, 2025
Homeజిల్లాలునెల్లూరురాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. అశోక్

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. అశోక్

విశాలాంధ్ర- వలేటివారిపాలెం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు యువతప్రధానకార్యదర్శి కామినేని అశోక్ అన్నారు. ఆదివారం రాత్రి తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు చుండి గ్రామంలో ఘనంగా నిర్వహించారు.నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి, యువత భవిష్యత్తు కు బాసటగా నిలిచిన నాయకుడు చంద్రబాబు ఒక్కడే నని కొనియాడారు.చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల అశోక్, కామినేని అనిల్, కామినేని రామకృష్ణ,కామినేని రాజేష్, కామినేని మనోహర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు