. స్మార్ట్ మీటర్ల పై దేశ వ్యాప్తంగా ఉద్యమం
. కమ్యూనిస్టు పార్టీని గ్రామీణ స్థాయి నుండి బలోపేతం
. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ
నేడు దేశం లో రాష్ట్రం లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులలో అణగారిన వర్గాలు రాజ్యాధికారం లోకి రావాలని కోరారు. పల్లకీలు మోసేదానికి కార్యకర్తలు గా మిగిలి పోకుండా చట్ట సభలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి అని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా సిపిఐ 24వ మహాసభలు నగరిలో ప్రారంభం అయ్యాయి. ఓం శక్తి గుడి నుండి బస్టాండ్ వరకు మహా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు, కళాకారుల ఆట పాట, కోలాట బృందాలు , ఇతర నృత్యరూపాలు పుర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రదర్శనలో కార్యకర్తలు చేసిన నినాదాలు హొరెత్తించాయి. వంద సంవత్సరాల సిపిఐ చరిత్ర పోరాటాల ఫలితాలతో రూపొందించిన బ్యానర్లు, కటౌట్ లు ప్రజలను ఆలోచింపజేశాయి. అనంతరం బస్టాండ్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజన్ అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ పరిశ్రమలు బాగా ఉండాలి అందులో పని చేస్తున్న కార్మికులు కూడా బాగుండాలి అని పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. సంపన్న వర్గాలు మరింత సంపన్నులు గా మారుతున్నారు పేదలు మరింత పేదలుగా మారుతున్నారు అన్నారు. గత ప్రభుత్వం లో కంటే నేడు కూటమి ప్రభుత్వం లో అవినీతి విపరీతంగా పెరిగింది అన్నారు. ఇసుక కొల్ల గొడుతున్నారు అన్నారు. నగరి ముఖ ద్వారంగా మైన్స్ తరలిస్తున్నారు అని అన్నారు. వీటిని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లో అడ్డుకుంటాం అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో అదానీ కంపెనీ కి దోచి పెట్టీ పేదల పై పెను భారం మోపుతున్నారు అన్నారు. స్మార్ట్ మీటర్ల ను మీటర్లు పగుల గొట్టమని పిలుపునిచ్చారు.నాడు లోకేష్ స్మార్ట్ మీటర్లు పగుల గొట్టాలనీ చెప్పిన లోకేష్ నేడు అదే మీటర్లను బిగించాలి అని చెప్పడం దారుణం అన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల్లో అదాని కంపెనీ లాభం పొందింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక మహిళలు, దళితుల పై దాడులు పెరిగాయి అన్నారు. ఈ నేపధ్యం లో కమ్యూనిస్టు పార్టీ నీ గ్రామీణ స్థాయి నుండి బలోపేతం చేయాలి అని పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పీ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లా లో ప్రధానంగా నగరి లో ఉన్న అనేక ప్యాక్టరీ లో కార్మికుల హక్కులు హరించి వేస్తుంటే కమ్యూనిస్టు పార్టీ ముందుండి పోరాటం చేసింది అన్నారు. యూనివర్సిటీ లో కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఘర్షణలు జరుగుతున్న ఆ నాడు ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యం లో పెద్ద పోరాటం జరిగింది అన్నారు. కమ్యూనిస్టుల కు భవిష్యత్ లేదు అనే వారికి ప్రజా సమస్యలపై పోరాటాలే నిదర్శనం అన్నారు. అధికారం లోకి రాకపోయినా కమ్యూనిస్టులు లేని దేశాన్ని చూడలేము అని మేధావి వర్గాలు చెబుతున్నారు అని గుర్తు చేశారు. దేశం లో పేదరికమే లేదు అని చెబుతున్న మోదీ 85 కోట్ల రేషన్ కార్డులు ఇచ్చిన దాని పై సమాధానం చెప్పాలి అన్నారు. పేదల 80 శాతం ట్యాక్స్ లు చెల్లిస్తుంటే కేవలం రెండు శాతం మాత్రమే పన్నులు కడుతున్నారు అన్నారు. రైతులు పండించిన పంటల కు గుట్టు బాటు ధరలు లేదు అన్నారు. దేశం లో ఏ రంగము ప్రశాంతంగా లేదు అన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు మాట్లాడుతూ గతం లో విద్యుత్ పోరాటం తో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు అన్నారు. నేడు మళ్ళీ మోడీ మాట విని అదానీ కంపెనీ కి మేలు చేకూర్చే విధంగా స్మార్ట్ మీటర్లు బిగించడానికి పూనుకుంటున్నారు అని, వెంటనే దీనిని వెనక్కు తీసుకోకుంటే మరో విద్యుత్ పోరాటానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివారెడ్డి, తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, చిత్తూరు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ టి జనార్ధన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోదండయ్య, గోపీనాథ్, దాసరి చంద్ర, మణి, ప్రేమ, విజయ గౌరీ, రమాదేవి, సత్యమూర్తి, కుమారి, నగరి పార్టీ నాయకులు వేలన్, మురళి, భాష తదితరులు. పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ గుర్రప్ప, రాష్ట్ర గాయకులు చారులత, జె నాగరాజు, హరిబాబు, డప్పుసూరి నాగభూషణం, ఇతర కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు సబితలను ఉత్తేజపరుస్తూ ఆలోచింపజేశాయి.