Homeజిల్లాలుఅనంతపురందొంగ ఓట్లు..దొంగ నోట్లతోనే ఎన్డీయేకి అధికారం..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ

దొంగ ఓట్లు..దొంగ నోట్లతోనే ఎన్డీయేకి అధికారం..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ

- Advertisement -

11 ఏళ్ళుగా దేశాభివృద్ధి శూన్యం..వ్యవస్థలను గుప్పెంట్లో పెట్టుకొని పెత్తనం చేస్తున్న మోడీ

డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏం లాభం…

విశాలాంధ్ర బ్యూరో, అనంతపురం..11 ఏళ్ల కిందట దేశానికి ఎన్నికైన ఎన్డీఏ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని పాలిస్తుందని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా దొంగ ఓట్లు దొంగ నోట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా మహాసభలు సందర్భంగా జరిగిన బహిరంగ ర్యాలీ, బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 140 కోట్ల జనాభా కలిగిన భారత దేశంలో వేలాది కులాలు, మతాలు భాషలు మాట్లాడే వ్యక్తులు ఉంటే హిందుత్వాన్ని పాటించాలని, ఆరెస్సెస్, బజరంగ్దళ్ పాలన కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎలక్షన్ కమిషన్ ను తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని, రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలగించి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఓటర్లను మాత్రం జాబితాలో చేర్చి ఎన్నికల నిర్వహించడం ఈసీ కి పరిపాటిగా మారిందని, దీనికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్ష నాయకుల పై అక్రమ కేసులు పెట్టడం చార్జి సీట్లు వేయడం బెదిరింపులకు దిగడం ఎన్డీఏ పెద్దలకు పరిపాటిగా మారిందని అన్నారు. గతంలో ఎలక్షన్ బూతుల్లో రిగ్గింగ్ జరిపే వాళ్ళని ఇప్పుడు ఓటరు జాబితాలోనే పేర్లు లేకుండా చేయడం చేస్తున్నారని గుర్తు చేశారు. బీహార్లో 65 లక్షల ఓట్లు గల్లంతయితే దీనిపై పార్లమెంటు స్తంభింప చేస్తూ ఉంటే మోడీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బెంగళూరులో మహదేవపుర లోక్సభ కాన్స్టెన్సీ లో లక్ష ఓట్లకు పైగా గల్లంతయ్యాయని కాంగ్రెస్ అభ్యర్థి 34 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం ఇందుకు నిదర్శనం అన్నారు. రాహుల్ గాంధీ బయటపెట్టిన ఆధారాలకు ఈసీ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎలక్షన్ కమిషన్ అధికారులు తేలు కుట్టిన దొంగలు లాగా ఉన్నారని గతంలో టిఎన్ శేషన్ చేపట్టిన సంస్కరణలను గుర్తు చేశారు. మోడీ , అమిత్షాలకు లొంగిపోయిన ఈసీ ప్రతిపక్ష ఆందోళనలు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. సిబిఐ, ఈడి , ఐటి , ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థలు అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్షాలను నోరు మెదుపుకుండా చేస్తున్నారని అక్రమ కేసులు బనాయిస్తున్నారని , సిపిఐ మాత్రమే ధైర్యంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. రైతుల సమస్యలు, ధరలు పెరుగుదల, ఉద్యోగాల కల్పన, నల్లధనం ఎక్కడికి పోయాయని నిలదీశారు. కమ్యూనిస్టులు రాబోవు రోజుల్లో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆగస్టులో జరిగే రాష్ట్ర మహాసభలు డిసెంబర్లో జరిగే జాతీయ మహాసభల్లో పలు తీర్మానాలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ తో ఒరిగింది ఏమీ లేదు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని రామకృష్ణ అన్నారు.164 సీట్లు ఇచ్చిన ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి చూపడం లేదన్నారు. అమరావతి పేరుతో వేల కోట్లు అప్పు చేసి తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని దుయ్యబట్టారు . 151 సీట్లు కలిగిన జగన్ కనీసం నెల నెల బటన్ నొక్కి జనానికి డబ్బు పంచాడని, చంద్రబాబు అలాంటిది ఏమీ చేయడం లేదని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీకి డబ్బులు తీసుకురాని చంద్రబాబు మోడీకి వంతు పాడుతున్నాడని ఆరోపించారు . రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మి గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెబుతున్న చంద్రబాబు ఆ డబ్బులు బయటకు తీసి ప్రజలకు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష 75 వేల కోట్లు అప్పు తెచ్చారని గతంలో జగన్ అప్పు తెస్తే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని ఎద్దేవా చేసిన చంద్రబాబు అంతకుమించి పోయాడని మండిపడ్డారు. రాజధాని పేరుతో 78 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చి ఏం సాధిస్తారని నిలదీశారు. ఏ కార్యాలయంలోకి వెళ్లిన లంచం ఇవ్వనిదే పని జరగడం లేదని అనంతపురం ఎమ్మెల్యే లాంటి వాళ్లు భూకబ్జాలకు పాల్పడుతుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు . అనంతపురం నగరంలో లేఅవుట్లు, షాపింగ్ మాల్స్, సైకిల్ స్టాంd యు చివరికి చికెన్ సెంటర్ వాళ్ళతో బెదిరింపులకు పాల్పడి గొంతు పట్టుకుని కొట్టుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇలాంటి ఎమ్మెల్యేలపై ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున విచారణ చేపట్టాలని చంద్రబాబుకు సూచించారు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ఎర్రజెండా ఉంటుందని సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేసేదాకా వెంటపడతామని హెచ్చరించారు.

ధర్మస్థల సంఘటనపై నోరు మెదపాలి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ కర్ణాటకలోని ధర్మస్థలంలో వందలాదిమంది మహిళల శవాలు బయటపడుతుంటే ఎన్డీఏ ప్రభుత్వం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. గడిచిన 30 సంవత్సరాలుగా అక్కడ అనేక ఉద్యమాలు జరుగుతున్న ధర్మస్థల ఆలయ ట్రస్ట్ సభ్యులపై ఎలాంటి ఈగ వాలకుండా అక్కడి పోలీసులు ప్రభుత్వాలు కాపలా కాస్తున్నాయని ప్రశ్నించారు 2014 నుండి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని విధ్వంశాలు చేస్తుందని మత విద్వేషాలు రెచ్చగొట్టి మహిళలపై దాడులు జరుగుతున్న ఇప్పటివరకు మణిపూర్లో మోడీ పర్యటించకపోవడాన్ని నిలదీశారు.

పి4 పిచ్చోడు చంద్రబాబు

రాష్ట్రంలో అత్యధిక ఎమ్మెల్యే లను గెలిపించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు చంద్రబాబు ఊహా లోకంలో విహరింప చేస్తున్నాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆరోపించారు . పి4 పేరుతో పేదరిక నిర్మూలన చేస్తానని నమ్మబలుకుతున్నాడని అదో పిచ్చి వ్యవహారం అని ఆరోపించారు. వ్యవసాయాన్ని పండుగ చేయడానికి స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు . ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఏలు ఇతర అలవెన్సులు ఇవ్వలేని చంద్రబాబు కనీసం తన సొంత కార్యకర్తలకు సైతం కాంట్రాక్టు బిల్లు చెల్లించలేని దీన అవస్థల్లో ఉన్నాడన్నారు. హంద్రీనీవా కాలువ వెడల్పు చేసిన గుత్తేదారులకు సైతం బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విలువైన భూములను కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేస్తున్నాడని విజయవాడలో ఆర్టీసీ స్థలాన్ని లు లు మాల్స్ కి ఇవ్వడానికి తప్పు పట్టారు. రైతాంగ అనుకూల నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని, ఎన్నికల విధానంలో బ్యాలెట్ పద్ధతి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ స్వాగత ఉపన్యాసం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు