Homeజిల్లాలుఅనంతపురంబూటకపు ఎన్‌కౌంటర్లు ఆపండి..వామపక్షాలు

బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపండి..వామపక్షాలు

- Advertisement -

అనంతపురం, విశాలాంధ్ర బ్యూరో: మారేడుమిల్లి సహా పలు ప్రాంతాల్లో జరుగుతున్న బూటకపు ఎన్‌కౌంటర్లును కేంద్ర ప్రభుత్వం ఆపాలని అనంతపురం వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.క్లాక్‌టవర్ వద్ద శనివారం సాయంత్రం నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లపై శుక్రవారం సిపిఐ కార్యాలయంలో వామపక్ష నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, సహాయ కార్యదర్శులు సి.మల్లికార్జున, జె.రాజారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి. రమణయ్య,శ్రీశైలం రాజేష్ గౌడ్,సిపిఐ ఎంల్ న్యూడెమోక్రసి జిల్లా అధ్యక్షులు ఇండ్ల ప్రభాకర్, సిపిఎం ఎంఎల్ జిల్లా కార్యదర్శి సి. నాగరాజు, ఎస్యుసిఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు పాల రంగయ్య,వేమన లు శుక్రవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజన–దళిత హక్కుల కోసం మావోయిస్టులు ప్రకటించిన చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు నేతలు ప్రకటించినప్పటికీ కేంద్రం ఎన్ కౌంటర్లు కొనసాగించటం అన్యాయమని వామపక్ష పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు.కేంద్రం ఇప్పటికైనా హింసాత్మక విధానాలను నిలిపివేసి ప్రజాస్వామ్యవాద బాట పట్టాలని వామపక్ష పార్టీలు కోరాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు