Homeజాతీయంటీఆర్పీలను ఆపండి.. బార్క్‌కు కేంద్రం ఆదేశం

టీఆర్పీలను ఆపండి.. బార్క్‌కు కేంద్రం ఆదేశం

- Advertisement -

న్యూదిల్లీ: పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రసారమవుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది. టీవీ వార్తా ఛానళ్లకు టెలివిజన్‌ రేటింగ్‌ పాయింట్లు(TRP) తెలియజేసే ప్రక్రియను తక్షణం నిలిపివేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రిసెర్చ్‌ కౌన్సిల్‌(BARK)ను శుక్రవారం ఆదేశించింది. నాలుగు వారాలు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే దాకా టీఆర్పీలను నిలిపి ఉంచాలని స్పష్టంచేసింది. టీఆర్పీల కోసం కొన్ని వార్తా ఛానళ్లు ప్రస్తుతం పశ్చిమాసియాలో సాగుతున్న యుద్ధానికి సంబంధించి అత్యుత్సాహంతో ఊహాజనిత, సంచలన కథనాలు వెలువరిస్తుండటంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ వార్తలు సాధారణ ప్రజానీకంలో భయాందోళనలు పెంచుతాయని, ముఖ్యంగా యుద్ధ ప్రాంతంలో బంధువులు చిక్కుకుపోయిన వారు వీటివల్ల తీవ్ర ఆందోళనకు గురవుతారని ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ 2014, జనవరి 16న టెలివిజన్‌ రేటింగ్‌ సంస్థలకు మార్గనిర్దేశకాలు జారీచేసింది. బార్క్‌ కూడా ఈ నిబంధనల పరిధిలోకి వస్తుంది. రేటింగ్‌ సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను, నియంత్రణలను, మార్గనిర్దేశాలను పాటించాలని నిబంధనలు చెబుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు