Homeజిల్లాలుకర్నూలుర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని హనుమాపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్ ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఆదోని ఏఎంవిఐ ఆవేష్ ఖాన్ లు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్ బాషా, వైస్ ప్రిన్సిపాల్ సుశీలమ్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు