విశాలాంధ్ర – రోలుగుంట: రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్ఓ కె.వీరజ్యోతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో అందిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించి, సిబ్బంది హాజరు రిజిస్టర్, రికార్డులను పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. తుఫాను కారణంగా సేవల్లో ఎలాంటి అంతరాయం ఏర్పడిందా సమాచారం తెలుసుకొని, వాక్సినేషన్ గదులను పరిశీలించారు. అనంతరం సంబంధిత అంశాలను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం వైద్య సిబ్బందితో ప్రజలు మరిగించిన నీరు తాగాలి, తాజా ఆహారం తీసుకోవాలి, పాత్రలకు మూత పెట్టి వాడుకోవాలి, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనబడితే వెంటనే పీహెచ్సీకి వచ్చి చికిత్స తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డా.శ్రావణి, డా.మజీదా బేగం, ఎంపిహెచ్ఓలు కృష్ణ, గోవిందు, హెచ్ఎస్లు షాజహాన్, వరాహలమ్మ, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.


