Homeజిల్లాలుకర్నూలుగోకులం షెడ్డును మంజూరు చేయండి

గోకులం షెడ్డును మంజూరు చేయండి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పంగ హనుమంతు తమ పశువుల సంరక్షణ కోసం గోకులం షెడ్డును మంజూరు చేయాలని కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనకు గోకులం షెడ్డు మంజూరు చేయాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ విజయం కోసం తాను సైనికుడిలా పని చేశానని, అయినా గోకులం షెడ్డు మంజూరు కాలేదన్నారు. తెలుగుదేశం పార్టీలో వర్గాలు ఉండడం వల్ల ఒక నాయకుని దగ్గరకు వెళితే నీవు నా వర్గానికి చెందిన వాడు కాదని నీకు పని చెయ్యం అంటున్నారని తెలిపారు. టీడీపీలో వర్గాల మూలంగా సామాన్య కార్యకర్త ఏ నాయకుని దగ్గరకు వెళ్లాలో అర్థం కాక మానసిక ఆవేదనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్పందించి అధికారులతో మాట్లాడి తనకు గోకులం షెడ్డును మంజూరు చేయించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు