Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి..

సచివాలయ ఉద్యోగులు సమయపాలన పాటించాలి..

- Advertisement -

సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతో తమ పనుల నిమిత్తం సచివాలయాలకు వస్తున్న ప్రజలు సకాలంలో తమ పనులు జరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నారని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు, ఈ సందర్భంగా శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రజలు తమ వివిధ పనుల నిమిత్తమై మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండా ప్రభుత్వ సేవలను గ్రామాల్లోనే పొందే విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ నేపథ్యంలో మండలంలోని
సచివాలయ ఉద్యోగులు చాలామంది గత ఏడాదికాలంగా సకాలంలో విధులకు హాజరు కాలేదని గ్రామీణ ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు అని తెలిపారు. ఒకవేళ డ్యూటీలకు వచ్చిన తరచూ వివిధ కారణాలతో కార్యాలయంలో ఉండకుండా బయటకు వెళ్తున్నారన్నారు అని తెలిపారు. దీంతో తమ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు.కాగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మండలంలో ఎంపీడీవో పోస్టు ఖాళీగా ఉండడం, తద్వారా దీర్ఘకాలం నుంచి ఇన్చార్జ్ ఎంపీడీవోలే కొనసాగుతూ ఉండడంతో అధికారుల పర్యవేక్షణ లేక సచివాలయ సిబ్బంది ఆడిందే ఆటగా పాడిన పాటగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. పరిస్థితుల్లో అధికారులు, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో నేటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు ఒక్కసారి కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.కనుక ఇప్పటికైనా సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.లేని పక్షంలో త్వరలోనే ఎంపీడీవో కార్యాల ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు