మంత్రి పయ్యావుల కేశవ్ కు విజ్ఞప్తి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ నియోజకవర్గంలో అధిక వర్షాలు వల్ల రైతులు సాగుచేసిన వివిధ రకాల పంటలు తీవ్రంగా నష్టపోయాయని సాగు చేసి నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు సిపిఎం పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం మంత్రి ఉరవకొండలో పర్యటించిన సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఆయనను కలిసి పలు సమస్యలపై మెమోరాన్ని అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బోరు బావులు, కాలువ క్రింద రైతులు సాగుచేసిన వేరుశనగ పంట పూర్తిగా తడిసి పశువులకు మేత కూడా పనికి రాకుండా పోయిందని తెలిపారు. కంది పంట కూడా పూత మొత్తం రాలిపోవడం జరిగిందని పప్పు శనగ పంట మొత్తం రంగు మారి కొన్ని ప్రాంతాల్లో కుళ్ళిపోవడం జరిగిందన్నారు. అనేక రకాల పంటల కూడా పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. నష్టపోయిన అన్ని రకాల పంటలకు నష్టపరిహారం వచ్చే విధంగా చూడాలని రైతులను అన్ని ఆదుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉరవకొండ పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డు రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని యార్డులో పంటలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఉరవకొండ పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎన్. మధుసూదన్ ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి, ప్రాంతీయ కమిటీ సభ్యులు జ్ఞానమూర్తి పాల్గొన్నారు.


