విశాలాంధ్ర అనంతపురం : పాల దాత-ప్రాణ దాత లావణ్య అక్టోబర్ 4 వ తేదిన అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో సాధారణ ప్రసవం ద్వారా మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంత మదర్స్ మిల్క్ బ్యాంకు గురించి తనకు వివరించడంతో లావణ్య తన భర్త బి.నవీన్ కుమార్ తో కలసి అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు వచ్చి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు తన పాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు దానం చేశారు. లావణ్య డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తన తల్లి వరలక్ష్మి ప్రోత్సాహంతో తన ఇంటిలోనే తన పాలను సేకరించి 12 లీ. తల్లిపాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకు కి అందించారు. నిరుపేద కుటుంబానికి చెందినటువంటి లావణ్య తన భర్త మరియు తల్లి ప్రోత్సాహంతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అనారోగ్యంతో అడ్మిట్ అయినటువంటి శిశువులు, నెలలు నిండకుండా పుట్టిన శిశువులు, పాలు లేనటువంటి శిశువులు, శిశు గృహ చిన్నారులు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో తన బిడ్డకు పాలు ఇస్తూ మిగులు పాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు దానం చేయడం ద్వారా ఒక మహత్తరమైన కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది . ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డిసిఎస్ఆర్ఎంఓ డా.జి.హేమలత న్యూట్రిషినిస్టు పల్లవి, రాధ మరుట్ల గ్రామంలోని లావణ్య నివాసానికి వెళ్లి తనను అభినందించి పాలను సేకరించారు. ఈ విషయంపై ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కే.ఎల్. సుబ్రహ్మణ్యం ఎంతో గొప్ప ఔదార్యంతో తల్లిపాలను అనంత మదర్స్ మిల్క్ బ్యాంకుకు దానం చేసినటువంటి లావణ్యను అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
పాల దాత – ప్రాణ దాత లావణ్య
- Advertisement -
RELATED ARTICLES


