Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రంథాలయ సెస్ బకాయిలు చెల్లించుకునే విధంగా కృషి చేయండి

గ్రంథాలయ సెస్ బకాయిలు చెల్లించుకునే విధంగా కృషి చేయండి

- Advertisement -

గ్రంథాలయ శాఖ ముఖ్య కార్యదర్శి రమా
విశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయ సెస్ బకాయిలు చెల్లించుకునే విధంగా కృషి చేయాలని గ్రంధాలయ శాఖ ముఖ్య కార్యదర్శి పి.రమా తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌరశాక గ్రంథాలయాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను వారు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కాసేపు పాఠకులతో గ్రంథాలయం అందిస్తున్న సేవలు గూర్చి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాఠకుల మెంబర్షిప్ ను పెంచుకోవాలని సూచించారు. పాఠకులకు కావలసిన పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అన్ని కూడా సమకూర్చుకోవాలని, వీలైతే దాతలు ద్వారా మరిన్ని పుస్తకాలను సేకరించే విధంగా ప్రయత్నం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి, సిబ్బంది రాము, గంగాధర్, ముకుంద, రమణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు