Thursday, January 30, 2025
Homeజిల్లాలుఏలూరునాటుసార విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

నాటుసార విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : నాటు సారా తయారుచేసిన, విక్రయించిన, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె వీరబ్రహ్మం తెలిపారు. మండలంలో బయ్యన్నగూడెం గ్రామంలో అక్రమంగా సారా విక్రయిస్తున్న మహిళను అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మండలంలో గల అంకాల గూడెం గ్రామానికి చెందిన, పాత నేరస్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఎల్ అండ్ డి పేట గ్రామంలో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై సారాయి తరలిస్తుండగా అతనిని కూడా అదుపులోకి తీసుకుని వీరి నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ దాడులలో ఏలూరు ఇన్స్పెక్టర్ ఆర్ .సత్యవతి, సబ్ ఇన్స్పెక్టర్ కే ఎం డి. ఆరిఫ్, జి. సునీల్ కుమార్, ఎల్. శ్రీనివాసులు, పి. రమ్య దుర్గ, కే. సత్యనారాయణ, ఎ .రాజేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు