విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా): ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాల దేవి పేర్కొన్నారు. పరింపూడి ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ను రాష్ట్ర కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


