Homeజిల్లాలుఅనంతపురంప్రభుత్వ సర్వజనాసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా హేమలత

ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా హేమలత

- Advertisement -

విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా డాక్టర్ హేమలత నియమితులయ్యారు. ఈ వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం నియామక ఉత్తర్వు జారీ చేశారు. మొన్నటి దాకా ఆర్ ఎంఓగా పనిచేసిన డాక్టర్ రామకృష్ణ గత నెలలో పదవీ విరమణ పొందడం జరిగింది. ఆయన స్థానంలోకి ప్రస్తుత ఉప ఆర్ఎంఓ డాక్టర్ హేమలతకు ఇంచార్జి ఆర్ ఎం ఒ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు శుక్రవారం ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు