Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థులు 'కళ్ల'పట్ల జాగ్రత్తలు వహించాలి

విద్యార్థులు ‘కళ్ల’పట్ల జాగ్రత్తలు వహించాలి

- Advertisement -

ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప

విశాలాంధ్ర ధర్మవరం: కంటిపట్ల విద్యార్థులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల ఎస్పీసీఎస్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ కంటి పరీక్షలలో 22 మంది పిల్లలకు కంటి దోషం ఉన్నందున, వారందరికీ పాఠశాల హెడ్మాస్టర్ పద్మావతి చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కరుణ, సురేష్, భాస్కర్, వెంకటాచలపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు