విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో సుదీర్ఘ కాలం పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న డి. హజీవలి రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలు కోల్పోయిన ఉద్యోగికి ఆర్థిక చేయూతగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులకు 41,111 చెక్కును పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య అందజేశారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యకు ఐక్యత, స్ఫూర్తి భావంతో ఉద్యోగులకు చేయూతనివ్వడం పట్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అవుట్సోర్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ , జిల్లా అవుట్సోర్సింగ్ ప్రధాన కార్యదర్శి ఓ. శిరిష్ రెడ్డి, అసోసియేషన్ సెక్రెటరీ డి. వెంకట రాముడు, ట్రెజరర్ డి. రహంతుల్లా, వైస్-ప్రెసిడెంట్ యం. క్రిస్టియ్యా, జాయింట్-సెక్రెటరీ ఏ. సాయినాథ్, కన్వీణర్ జి. దివాకర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ యం. వెంకట రాముడు, మహామదఫ్ రఫీ, మధుసూదన్ రెడ్డి, నాగభాస్కర్ రావు, హరి కృష్ణ మరియు ఉద్యోగులు రఘునాథ్, సిరాజ్, తిరుమల కొండ ఆంజనేయులు పాల్గొన్నారు.


