విశాలాంధ్ర ధర్మవరం: కూలీల నుంచి చిన్న వ్యాపార కార్మికుల వరకు అందరికీ రక్షణ ఈషారము కార్డులు పథకం ఎంత కోణం ఉపయోగపడతాయని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని టెక్స్టైల్స్ దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులతో పాటు అసంఘటిత రంగానికి చెందిన వివిధ వృత్తుల్లో శ్రమిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డులను మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు స్వయంగా అందజేశారు. కార్డు ద్వారా కార్మికులకు ప్రమాద బీమా రక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత, అత్యవసర పరిస్థితుల్లో సహాయం, ఉద్యోగ మరియు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వస్త్ర వ్యాపారుల సంఘం ప్రెసిడెంట్ వెంకటేష్, సలీం భాష, శేషాద్రి బీ.ఏం భాష, గుండ్లపల్లి ధనుంజయ, మురళి, సుధాకర్, వస్త్ర వ్యాపారుల సంఘం సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు.
టెక్స్ టైల్ షాప్ కార్మికులకు ‘ఈ శ్రామ్’ కార్డులు పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


