Homeజిల్లాలుతూర్పు గోదావరిచిత్రలేఖనంలో రామలక్ష్మి కి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు

చిత్రలేఖనంలో రామలక్ష్మి కి గోల్డెన్ స్ట్రోక్ అవార్డు

- Advertisement -

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం కు చెందిన చిత్రలేఖనం
కళాకారిణి రామలక్ష్మి విశ్వనాధంకు గోల్డెన్స్ట్రో క్ అవార్డు లభించింది. హైదరాబాద్లోని నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో క్రియేటివ్ హార్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 10న జాతీయ స్థాయి కళాప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో కేరళా సంస్కృతి ఉట్టిపడేలా కేరళీయం అంశంతో రామలక్ష్మి రూపొందించిన చిత్ర లేఖనం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. కేరళా రాష్ట్ర సంప్రదాయ వేషధారణ పండుగలు నృత్యరీతులు తిరుచునాపురం కథకళి మోహినిఅట్టం వంటి రీతులన్నిటినీ ఒకే చిత్రంలో ప్రతిబింబించేలా కేరళీయం గా రూపొందించిన ఈ చిత్రం ప్రదర్శనలో ప్రత్యేక గుర్తింపు పొంది అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా క్రియేటివ్హా ర్ట్స్ సంస్థ వ్యవస్థాపకుడు అంజి ఆకొండి ఈ అవార్డును రామలక్ష్మి కి అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు