ఘనంగా ప్రారంభమైన సిపిఐ జిల్లా రెండవ మహాసభలు
భారత కమ్యూనిస్టు పార్టీ తిరుపతి జిల్లా రెండవ మహాసభలు సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న మహాసభలకు సూళ్లూరుపేట వేదికగా మారింది. మహాసభల సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్ళు అరుణారుణ పథకాలతో ఎరుపుమయం అయింది. తొలిరోజు జి ఎన్ టి రోడ్డు నుండి బజారు వీధి మీదగా ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన మహా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. రెడ్ షర్ట్ వాలంటీర్లు పార్టీ పథకాలను చేతబోని కవాతు నిర్వహించారు. మహిళలు ఎరుపు చీరలు ధరించి ర్యాలీలో అగ్రభాగాన గెలిచారు. బ్యాండ్ మేళం, కోలాట కళాకారులు, డప్పు నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు చేసిన నినాదాలు పట్టణ పుర ప్రజలను ఆలోచింపజేశాయి. ర్యాలీలో ముందు భాగాన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, శివారెడ్డి, జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి మురళి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తదితరులు నిలిచారు. బహిరంగ సభ వేదిక వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ కే నారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభ వేదిక మీదికి అతిథులను జిల్లా కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్రంలో కేంద్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ వివరించారు. మహాసభలలో చర్చించాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణ పై సూచనలు చేశారు. జిల్లాలో ప్రజానీకం ఏరుకుంటున్న సమస్యలపై చర్చించి తీర్మానాలు రూపొందించి భవిష్యత్తు పోరాట కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఈ సందర్భంగా బహిరంగ సభ వేదికపై. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, ఎస్ గుర్రప్ప, జె నాగరాజు, చారులత హరి నాగభూషణం డప్పుసూరి సుమన్ ఫ్లూట్ సుబ్బు నాగభూషణం తదితరులు ఆలపించిన గేయాలు, చిన్నారులు చేసిన నృత్యాలు సభికులను ఆకట్టుకున్నాయి.


